ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో ప్రముఖ పెయిన్ రిలీఫ్ బ్రాండ్ ‘మై డాక్టర్’ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంతో మరింత శక్తివంతంగా మారింది. ఆరోగ్యం, క్రీడ, వినోదాన్ని కలిపిన ఈ విప్లవాత్మక ముందడుగు.. ఇండియన్ ఓటీసీ రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వార్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్నర్‌తో ‘మై డాక్టర్’ భాగస్వామ్యం చేసుకుంది.
రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ సందర్భంగా డేవిడ్ వార్నర్‌తో ‘మై డాక్టర్’ డైరెక్టర్ శ్రీ రఘునందన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మై డాక్టర్ అని ఉన్న బ్యాట్‌పై వార్నర్ సంతకం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇది భారతదేశంలో ఓ విశిష్టమైన భాగస్వామ్యం. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టార్‌తో కలిసి పనిచేయడం మాకు గర్వకారణం. డేవిడ్ వార్నర్ మాతో చేరడం వలన బ్రాండ్‌కు ఎనర్జీ, విజిబిలిటీ రెండూ గణనీయంగా పెరుగుతాయనే నమ్మకం ఉంది’ అని శ్రీ రఘునందన్ తెలిపారు.
Also Read: CSK vs MI: నా మైండ్ బ్లాక్ అయింది.. ఎంఎస్ ధోనీ సూపర్: రుతురాజ్ గైక్వాడ్
‘మై డాక్టర్’ బ్రాండ్ తన విస్తృత శ్రేణి ఉత్పత్తులతో పెయిన్ రిలీఫ్ ఆయిల్, క్రీమ్, స్ప్రే, ప్యాచ్‌లు, ఇతర ఫార్ములేషన్లతో అనేక కుటుంబాల్లో నమ్మకాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు డేవిడ్ వార్నర్, రాబిన్‌హుడ్ మూవీ క్రేజ్‌తో మై డాక్టర్ బ్రాండ్ ప్రజల హృదయాల్లోకి మరింతగా దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇక రాబిన్‌హుడ్ సినిమాతోనే వార్నర్ తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ నెల 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టైటిల్ అందించిన వార్నర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రేజ్ పక్కాగా మై డాక్టర్‌కు ఉపదయోగపడనుంది.