మెట్రోకు సంబంధించిన అనేక రకాలైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్విస్తే.. కొన్ని ఏడిపించేవి కూడా ఉంటాయి. ఇంకొన్నేమో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇటీవల.. బెంగళూరు మెట్రోలో జరిగిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఓ రైతు మురికి బట్టలు ధరించాడని మెట్రో ఎక్కకుండా ఆపారు. తర్వాత దీనిపై పెద్ద దుమారమే రేగింది. అదేవిధంగా.. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలో కొంతమంది పాడుతూ, మరికొంత మంది డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ వీడియోలో కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు మెట్రో లోపల పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆ సీన్ చూస్తుంటే ఏదో ఒక పార్టీలో అనుకుంటే పొరపాటే.. ఇదంతా మెట్రో లోపల జరుగుతున్న సీన్.. అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో వీడియోలో చూడవచ్చు. మెట్రో లోపల శబ్దం చేయకూడదని నిషేధం ఉన్నప్పటికీ.. పెద్ద ఈవెంట్ పెట్టారు. అయితే.. కొందరికి ఈ వీడియో నచ్చినా.. మరి కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఢిల్లీ మెట్రోలో జరుగుతున్న ఈ కచేరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagramలో apna_shehar_delhi4 అనే ఐడీతో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షకు పైగా వీక్షించారు. అంతేకాకుండా.. వేలాది మంది లైక్ చేసారు. మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.