Mumbai on alert after Bomb Threat Message: వాణిజ్య రాజధాని ముంబైకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ముంబైలోని ఆరు ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు మెసేజ్‌లో పేర్కొన్నాడు. దీంతో ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దాంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
టెక్స్ట్ మెసేజ్ చేసిన వ్యక్తి కోసం ముంబై పోలీసులు గాలింపు చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు చెందిన వాట్సప్ నంబరుకు ఈ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందస్తు చర్యలో భాగంగా భద్రతా ఏజన్సీలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. టెక్స్ట్ మెసేజ్ కారణంగా ఉదయం ముంబై వాసులు బయబంత్రులకు గురయ్యారు.
Also Read: Karnataka: ఇద్దరు పిల్లలు.. కట్ చేస్తే హిజ్రాగా మారాడు! విషయం తెలిసి మూర్ఛపోయిన భార్య
ముంబైకి బెదిరింపులు కాల్స్, మెసేజ్‌లు రావడం ఇదేమి కొత్తకాదు. గతంలోనూ పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకల వేళ ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి.. పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు చెప్పాడు. అంతకుముందు ఆర్‌బీఐ ఆఫీసులు, పలు బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపులు వచ్చాయి. అయితే అవన్నీ నకిలీవేనని తేలింది.