Mumbai on alert after Bomb Threat Message: వాణిజ్య రాజధాని ముంబైకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ముంబైలోని ఆరు ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు మెసేజ్‌లో పేర్కొన్నాడు. దీంతో ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దాంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.…