టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు ముస్సోరీలో జరుగుతున్నాయి. బుధవారం, గురువారం రెండ్రోజులుగా ఐటీసీ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సతీసమేతంగా కలిసి వచ్చాడు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.