MP Santhosh: నవ మాసాలు కని పెంచిన తల్లిని, పుట్టిన ఊరును మరవద్దంటారు పెద్దలు. తల్లి, ఊరు కోసం ఎంత చేసినా తక్కువే అవుతుంది. అందులో ఒకరు జన్మనిస్తే.. మరొకటి జీవితాన్ని ప్రసాదించింది. అందుకే మనం పెద్దయ్యాక ఎక్కడ ఉన్నా తల్లిని, పుట్టిన ఊరును ఎప్పుడూ మర్చిపోకూడదు. అదే బాటలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ తాను పుట్టిన పేట్ల బుర్జు ప్రభుత్వం ఆస్పత్రి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలను కేటాయించారు. తాను పుట్టిన హస్పిటల్ ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Also: Midday Meal in Bihar: బల్లి పడిందన్నా బలవంతంగా తినిపించారు.. 200మంది పరిస్థితి ఏమైందంటే
ఎంపీ సంతోష్ నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తిని కలుగచేస్తుందని మంత్రి అన్నారు. ఇదే క్రమంలో దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ హస్పిటళ్ల అభివృద్ధి దోహద పడ్డ వారవుతారని సూచించారు. ఈ నిధులతో పేట్ల బుర్జు హస్పిటల్ ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఎంపీ సంతోష్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ హస్పిటల్ లో జన్మించిన వారు, ఆయా హాస్పిటల్స్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. పేట్ల బుర్జు ఆస్పత్రి అవసరాలు, సౌకర్యాలు తీర్చేలా నిధులు వినియోగించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.