దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో హస్తినలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.
మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (ఎన్‌ఇహెచ్‌యూ) ఆందోళనలతో అట్టుడికింది. వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆందోళనలు ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఎట్టకేలకు పీడబ్ల్యూడీ అధికారులు అధికారిక నివాసం కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిషి షిప్ట్ అయ్యారు. వస్తువులన్నీ తరలించారు.
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఓ పాడుబడిన కారులో మృతదేహాలు లభించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటికి రాగానే ఒక విధమైన ఉద్వేగ వాతావరణం చోటుచేసుకుంది.
తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురయ్యారు. శుక్రవారం పెరంబూర్‌లోని ఆయన నివాసానికి సమీపంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు కూటమిల మధ్య ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమిలు దెబ్బ దెబ్బగా సీట్లు సాధించాయి. బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు సాధించకపోయినా.. మిత్ర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెల మొదటి వారంలో నరసరావుపేటలో జరిగే రా కదలి రా సభలో లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జంగా కూడా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.