జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిర్వహించిన బీజేపీ నియోజకవ్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. జగిత్యాల డబుల్ బెడ్ రూమ్ స్కాముల్లో సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు.. అయన కూడా మరో మల్లారెడ్డిగా మారుతుండు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సొమ్మును కొళ్లగొట్టిన ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలుకు వెళ్లడం పక్కా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొల్లగొట్టిన సొమ్మును రికవరీ చేసి మీ ముందు ఉంచుతామని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘బీజేపీ అధికారం లోకి వస్తే ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం.. కాంగ్రెస్ పార్టీ మొదటి సారి తెలంగాణ ఇచ్చి వెనుకడుగు వేయడంతో ఎంతోమంది యువకులు బలిదానాలు చేసుకున్నారు.. ఆ పాపం కొట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయింది.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు ఊసే లేదు.. తెలంగాణ ను కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు మోసం చేసింది… వరి, చెరుకు, మామిడి రైతులను నిండా ముంచింది..కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లే.. ముందు కేటీఆర్ ను చెప్పుతో కొట్టాలి.. వ్యవసాయం కోసం ఉచిత ఎరువులు ఇస్తానని హామీ ఇచ్చిన మీ అయ్య మాట ఎక్కడ పోయింది.. మోడీ సర్కార్ ఎరువుల పై ఎకరాకు 24 వేల సబ్సిడీ ఇస్తున్నారు.. గత పది ఏళ్లల్లో కేసీఆర్ సర్కార్ పంట నష్టం కు ఒక్క రూపాయి అయినా ఇచ్చిండా..
నీళ్లు,నిధులు,నియామకాలు కేసీఆర్ కుటుంబానికి పోతే తప్ప,తాలు తెలంగాణ వాళ్లకు దక్కింది.. కేటీఆర్ చానళ్ల కు ఇంటర్వ్యూలు ఇస్తుండు.. మీ అయ్యకు నోరు పడిపోయిందా ఎందుకు మాట్లాడటం లేదు.. డిసెంబర్ మొదటి వారంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు.. గింతత ఉన్న రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటుండు.. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటో నాకంటే ఎక్కువ తెలుసా రేవంత్ రెడ్డికి. బీఆర్ఎస్ ఓడిపోతే కల్వకుంట్ల ఫ్యామిలీలోని నలుగురు నాలుగు దిక్కులకు పోతారు.. తెలంగాణ భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ సర్కారు రావాలి.. జగిత్యాల నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో 40 శాతం ముస్లింలకే కేటాయించారు.. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లోనూ ముస్లిం లను మినహాయించి హిందువుల వద్ద వసూళ్లకు పాల్పడ్డారు.
గల్ఫ్ బాధితులందరూ సిరిసిల్లలో నామినేషన్లు వేయిండ్రి.. కేటీఆర్ కు మస్తీ వంచాలి.. జగిత్యాల లో కాంగ్రెస్ మూడో స్థానం.. కాంగ్రెస్‌కు ఓటు వేసిన బీఆర్ఎస్ కు ఓటు వేసిన సీఎం అయ్యేది కేసీఆర్.. రేవంత్ రెడ్డి సంచులు బంద్ అయి.. లారీల్లో కోట్ల డబ్బు తరలుతొంది.. సమాజానికి క్యాన్సర్ ఈ అవినీతి పార్టీలే. కేసీఆర్ తాగి పడతాడు.. కేటీఆర్ మత్తు పిలుస్తాడు.. కవితనేమో పైసల పిశాచి..’ అని ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.