దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన తాజా చిత్రం ‘మోగ్లీ’ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అడవి నేపథ్యంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామా లో యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ జంటగా నటించారు. ఈ రోజు (డిసెంబర్ 13) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్స్ వేయగా, అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా అద్భుతమైన స్పందన లభించింది. తొలి ఆట నుంచే ఈ సినిమా కంటెంట్‌కు, నిర్మాణ విలువలకు మంచి ప్రశంసలు దక్కుతుండటంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. అంతే కాదు
Also Read : Chiranjeevi-Pawan Kalyan :మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. చిరు–పవన్ నుంచి వరుస అప్డేట్స్
ఉత్తర అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల ద్వారా ‘మోగ్లీ’ చిత్రం ఏకంగా 30 వేల డాలర్లు (సుమారు 25 లక్షల రూపాయలు) వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది రోషన్ కనకాల మార్కెట్‌కు, సినిమా కంటెంట్‌కు ఉన్న బలాన్ని ఇస్తోంది. ముఖ్యంగా, ఇలాంటి వైవిధ్యమైన కథాంశానికి అమెరికాలో ఇంత మంచి ఆరంభం లభించడం నిజంగా విశేషం. ఈ అద్భుతమైన ఆరంభాన్ని, సినిమాకు వస్తున్న సానుకూల స్పందనను చూసి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా ధీమాగా ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం ఓవర్సీస్‌లో సాలిడ్ కలెక్షన్లు సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు కాల భైరవ అందించిన సంగీతం, ముఖ్యంగా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.