చైనీస్ మొబైల్ తయారీ సంస్థ హానర్ మళ్లీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్తమోడళ్లతో మార్కెట్ లోకి రాబోతున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించకుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. దాంతో ఇండియాలో ఉండలేక కొంతకాలం పాటు దాని సేవలను నిలిపివేసింది. అయితే మరోసారి ఇండియాలోకి తిరిగి రాబోతున్నట్లు ఎక్స్(ట్విటర్) వేదికగా తెలిపింది. చైనా మార్కెట్ లో ఇటీవల విడుదలైన హానర్90ని ఇండియాలోకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నోయిడాకు చెందిన పీఎస్ఏవీ గ్లోబల్‌తో ఆనర్ మూడేళ్ల క్రితం పంపిణీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇన్ని రోజుల తరువాత తిరిగి భారత మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. వచ్చే నెలలో హానర్ 90 ని భారత్ లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయ.
Also Read:Mahindra OJA: నాలుగు చక్రాలతో నడిచే తేలికపాటి ట్రాక్టర్లను ఆవిష్కరించిన మహీంద్రా గ్రూప్
చైనాలో ఈ ఏడాది మొదట్లో ఆనర్ 90తోపాటు 90 ప్రొను విడుదల చేశారు. స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ ఓలెడ్ డిస్‌ప్లే, 12 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సల్ కెమెరా కలిగి ఉంది. అంతేకాకుండా ఇందులో ఏకంగా 16జీబీ ర్యామ్ ఉంది. 512 జీబీ అంతర్గత మెమరీ, 5జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.1, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోంది. దీని ధర రూ. 50వేలలోపు ఉంటుందని టాక్. అంటే సెగ్మెంట్లో వన్‌ప్లస్ 11ఆర్, నథింగ్ ఫోన్ 2, ఒప్పో రెనో 10 ప్రో లాంటి స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్‌తో నాలుగు విభిన్న రంగులలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇంతకాలం తన ఫోన్ బ్రాండ్ ను కొనసాగించకపోయినప్పటికీ హానర్ ఇండియాలో మాత్రం కొత్త ఉత్పత్తులను కొనసాగించింది. Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లను భారత మార్కట్ లో ఉంచింది. ఇక మరోవైపు ఇండియాలో హానర్ విడుదల చేసిన చివరి స్మార్ట్‌ఫో న్ హానర్ 9ఏ రూ.10వేల బడ్జెట్ ధరలో లభించేది.