చైనీస్ మొబైల్ తయారీ సంస్థ హానర్ మళ్లీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్తమోడళ్లతో మార్కెట్ లోకి రాబోతున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించకుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. దాంతో ఇండియాలో ఉండలేక కొంతకాలం పాటు దాని సేవలను నిలిపివేసింది. అయితే మరోసారి ఇండియాలోకి తిరిగి రాబోతున్నట్లు ఎక్స్(ట్విటర్) వేదికగా తెలిపింది. చైనా మార్కెట్ లో ఇటీవల…