Mahindra OJA: నాలుగు చక్రాలతో నడిచే తేలికపాటి ట్రాక్టర్లను ఆవిష్కరించిన మహీంద్రా గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra OJA: భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశమే. మనదేశ వ్యవసాయంలో ట్రాక్టర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇక దేశీయంగా ట్రాక్టర్ల వ్యాపారంలో మహీంద్రా గ్రూప్ పెద్దది. ఎంతో నాణ్యమైన ట్రాక్టర్లను అందించడంలో మహీంద్ర గ్రూప్ ముందుంటుంది. నమ్మకానికి మారు పేరు ఈ బ్రాండ్. గట్టిగా, కఠినంగా ఉండే వ్యవసాయం క్షేత్రాల్లో సైతం ఈ ట్రాకర్లు మెరుగైన పనితీరుని కనబరుస్తాయి. ఈ ట్రాక్టర్లు ఉత్తమంగా పనిచేస్తామని ఎంతో మంది రైతన్నలు సైతం చెబుతూ ఉంటారు. ఇక తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు మహీంద్రా గ్రూప్ అతి పెద్ద ప్రకటన చేసింది. ‘ఫ్యూచర్-రెడీ’ ట్రాక్టర్ల శ్రేణిని ఆవిష్కరించింది. వీటికి మహీంద్రా ఓజా అని పేరుపెట్టింది. ఈ కార్యక్రమం దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరిగింది.
ఈ ట్రాక్టర్లలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇవి నాలుగు చక్రాలతో నడిచే లైట్ వెయిట్ ట్రాక్టర్లు. దీనిని ట్రాక్టర్ టెక్నాలజీలోనే నూతన ఆవిష్కరణగా పేర్కొనవచ్చు. డిజైన్ & ఇంజనీరింగ్‌లో ట్రాన్స్‌ఫార్మేటివ్ మార్పును తీసుకొస్తూ 4WD స్టాండర్డ్‌తో 7 కొత్త ట్రాక్టర్ల మోడళ్లను విడుదల చేసింది మహీంద్ర గ్రూప్. కాంపాక్ట్ , స్మాల్ యుటిలిటీ ప్లాట్‌ఫారమ్‌లలో భారత మార్కెట్ కోసం వీటిని రూపొందించింది. రైతులు ఎక్కువ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కొత్త OJA ట్రాక్టర్ల శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా & మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా వెల్లడించారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
Also Read: Adani: అదానీ గ్రూపులో చేరిన ఆ మీడియా సంస్థ.. పూర్తిగా కొనుగోలు
వీటి ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే వీటిని ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రకటించింది. PROJA, MYOJA, ROBOJA అనే మూడు అడ్వాన్స్ టెక్నాలజీలతో లైట్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. ఈ మోడల్‌లు 20HP-40HP పవర్ కలిగి ఉంటాయి. ఏషియన్, యూరోపియన్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు ఇవి కంపెనీకి ఉపయోగపడతాయని మెుబిలిటీ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కొత్త మోడల్ ట్రాక్టర్లు ప్రపంచంలో పావు వంతు అంటే 25 శాతం మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
And here’s the Mahindra Tractors OJA range pic.twitter.com/th0FvyXjs4
— Sirish Chandran (@SirishChandran) August 15, 2023
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?