జగిత్యాల పట్టణం పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీగా గెలిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తానన్నారు. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం.. మంచంలో పడుకొనైనా ప్రజలకు అండగా నిలుస్తానన్నారు. బలహీన వర్గాలకు కేటాయించిన హక్కులు వారికే చెందేలాగా వారి హక్కులను కాపాడానని సంతృప్తి మిగిలిందని, నా ప్రతి విజయంలో…