Prajavani: ఎన్నికల కోడ్‌తో తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి మళ్లీ ప్రారంభం కానుంది. నేటి నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయనికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఐదవ జాబితా కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టారు. సీఎంఓకు వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, సుచరిత, అన్నాబత్తుని శివ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామి రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రి జోగి రమేష్…
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట పంచాయతీ ముగిసింది. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సర్దుబాటు కసరత్తు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గం వాదనలు విన్న విజయసాయిరెడ్డి.. ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేశారాయన. అంతేకాకుండా.. పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయసాయి రెడ్డి వారికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది. సీఎంవో నుంచి నేతలకు ఫోన్‌లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది.. సీఎంవో నుంచి నేతలకు ఫోన్‌లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు.
రుషికొండలో రాజమహల్ నిర్మించుకొంటూ క్లాస్ వార్ అంటారా?.. అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పేదవాడికి సెంటు భూమే.. ముఖ్యమంత్రి నివాసానికి 9 ఎకరాలు.. రూ.451 కోట్లు ఖర్చు చేస్తారా?.. సీఎం పచ్చదనం చూసేందుకు ప్రహరీ నిర్మించి గడ్డి పెంచడానికి.. రూ 21 కోట్లు నిధులా? అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్ కాచిగూడలో దంపతులు సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించారు. వారి వద్దనుంచి దంపతులు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి ఇద్దరు కోట్ల రూపాయలు వసూలు చేశారు. మెడికల్ సీట్ కి 50 లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేశారు.