Tirumala Leopard Attack: తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షిత మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది.. తిరుమల – అలిపిరి కాలి నడక దారిలో చిన్నారి లక్షిత మొదట తప్పిపోయింది.. ఆ తర్వాత ఆ చిన్నారిపై ఎలుగుబంటి దాటిచేసి చంపిఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అయినా.. చివరకు నిన్న రాత్రి తప్పిపోయిన లక్షిత ఉదయం నడకదారిలోని నరసింహస్వామి ఆలయం వద్ద శవమై తేలింది.. చిన్నారి మెడపై దాడి చేసి ముఖ భాగాన్ని పూర్తిగా తినేసి ఉండడంతో.. చిన్నారి లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు.. చివరకు చిరుత దాడిలోనే చిన్నారి మృతిచెందినట్టు తేల్చారు.. అయితే, ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
Read Also: TV Channel Editor Arrested: టీవీ ఛానెల్ ఎడిటర్ అరెస్ట్.. నుహ్ మత హింసపై తప్పుడు వార్త కథనాలు
తిరుమల ఘాట్ రోడ్‌లో మృతి చెందిన లక్షిత ఘటనపై స్పందించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. లక్షిత మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు.. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవోతో ఫోన్‌లో మాట్లాడాను.. వారు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకునే విషయాన్ని కూడా ఆలోచిస్తామని తెలిపారన్న ఆయన.. అయితే, ఈ ఘటనలో లక్షిత తల్లిదండ్రులపై నాకు అనుమానం ఉందన్నారు. వారిని కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కాగా, అలిపిరి నడకమార్గంలో నిన్న రాత్రి బాలిక తప్పిపోయ్యినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక పేరెంట్స్.. అయితే, ఆ ఫిర్యాదు అందుకున్న పోలీసులకు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. కానీ, బాలిక ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇవాళ ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.. చిరుత దాడిలో బాలిక మృతిచెందినట్టు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.