Stock Markets intraday: వారంలో రెండో ట్రేడింగ్ రోజు మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ లోని సెన్సెక్స్, నిఫ్టీ రెండూ లాభాలను నమోదు చేశాయి. ఈరోజు సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 81,455.4 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 24,857.3 వద్ద ముగిశాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 ఏకంగా 90 పాయింట్ల లాభంతో 16,546.55 పాయింట్ల వద్ద ముగిసింది. ఇకపోతే నేడు ఈరోజు టాప్ గెయినర్స్‌లో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ షేర్లు లాభాలతో మంచి పనితీరు కనబరిచాయి. సన్‌ఫార్మా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు భారీగా పడిపోయి టాప్ లూజర్ లుగా ఉన్నాయి.
Lavanya Audio: లావణ్య -మస్తాన్ సాయిల ఆడియో లీక్.. అంతకు మించి అంటూ!
నేడు మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయని చెప్పవచ్చు. మరోమారు ఇన్వెస్టర్స్ అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో మొదట భారీ లాభాల్లోకి వెళ్లిన సూచీలు.. ఆపై స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఇందుకు తోడయ్యాయి. అమెరికా ఫెడ్ సమావేశం నేడు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. వడ్డీ రేట్లపై ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధర కాస్త తగ్గింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 79.73 డాలర్లు పలుకుతుండగా.. బంగారం ఔన్సు 2380 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.
Viral Video: వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ ఫుడ్ ఇచ్చిన వెయిటర్.. చివరకు.?