తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో కథ. తెలంగాణలో ఆదాయం తగ్గకపోయినా.. అప్పులు పెరుగుతున్నాయి. ఏపీలో ఆదాయం పెరగడం లేదు. అప్పులు పేరుకుపోతున్నాయి. పైగా అప్పులు తీర్చడానికి అప్పులు చేయక తప్పని విష విలయం రెండు రాష్ట్రాల్లో నడుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న రైతు హామీల సాధన కోసం దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఈ దీక్షలో బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
Congress: కుల గణనను ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ ఉపకరణంగా వినియోగించరాదని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. నాగోబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్న అసెంబ్లీలో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీని సంబంధించి వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ కాదని ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్ ఎంఐఎంని ప్రొటెం స్పీకర్ చేసిందని విమర్శలు చేశారు. అందుకే బీజేపీ ప్రొటెం స్పీకర్ ఎంపికను వ్యతిరేకించిందని ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రాజకీయం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఎవరిపేరు పంపితే వారినే గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారని..…
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు హామీలను ప్రకటించారు. ఇందులో మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, చట్టం ద్వారా పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు, ఏదైనా సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలకు ₹ 15 లక్షల బీమా కవర్ వంటి హామీలు ఉన్నాయి.
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఐదు హామీలను ప్రకటించారు. ఆమె జబల్‌పూర్ జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభించారు.