ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మహబూబాబాద్ రూపురేఖలు మారిపోయాయన్నారు గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లో ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు ఆమె. అంతేకాకుండా.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మహిళా ఆరోగ్యం – ఇంటి సౌభాగ్యం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఒకే రోజు 15నార్మల్ డెలివరీలు చేసిన వైద్య బృందాన్ని సత్కరించారు మంత్రి సత్యవతి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య మహిళ దవాఖానల్లో అటెండర్ నుంచి డాక్టర్ వరకు అందరూ మహిళలే ఉంటారని, మహిళలు నిర్భయంగా వెళ్లి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు మంత్రి సత్యవతి. కుటుంబంలోని మహిళ బాగుంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Virat Kohli : ప్రతిసారి వంద కొట్టాలంటే కష్టం
కొత్త స్కీంలో మహిళలకు 8 రకాల ఉచిత పరీక్షలు, మందులు, సూచనలు, ఆరోగ్య సలహాలు లభిస్తాయని ఆమె తెలిపారు. ఇక్కడ పరిష్కారంకాని సమస్యలను జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలకు రెఫర్ చేస్తారని వివరించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్, ప్రత్యేక వార్డు ఉంటుందని పేర్కొన్నారు మంత్రి సత్యవతి. చికిత్స చేయించుకునే స్థోమత లేని మహిళలు తమ ఇబ్బందులు చెప్పుకోలేక వ్యాధులు ముదిరిపోయే పరిస్థితికి తెచ్చుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి సత్యవతి.
Also Read : MLC Kavitha : రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశం