మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు మంత్రి ఆర్కే రోజా. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సైకోకు పరాకాష్టగా మారారన్నారు మండిపడ్డారు. జనం రాకపోవడంతో రోడ్లపై సభలు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కు పదవులే ముఖ్యమని, 2 చోట్ల ఓడిన పవన్‌ను చూసి ఎవరూ భయపడరన్నారు. పవన్ సినిమాల్లోనే గబ్బర్ సింగ్.. రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అంటూ రోజా ఎద్దేవా చేశారు. పవన్ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడని మంత్రి రోజా విమర్శించారు.
Also Read : Fake Doctor: నకిలీ డాక్టర్ పట్టాతో కోట్లు సంపాదించింది.. సీన్ కట్ చేస్తే
నన్ను డైమండ్ రాణి అన్నారని, నేను నిజంగా రాణినే అన్న రోజా… ఇంట్లో, రాజకీయంగా, నటిగా నన్ను నేను నిరూపించుకుని రాణిలా ఉన్నానన్నారు. మరోసారి పవన్ నా గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. చిరంజీవికి నాకు ఎలాంటి గొడవలు లేవని మంత్రి రోజా స్పష్టం చేశారు. సీఎం జగన్ అన్ని రంగాలలో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే అన్నీ పార్టీలు గుంపులుగా వస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ 175 సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుంది అని మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.
Also Read : Anchor Anasuya: నాకు ఆ డిజార్డర్ ఉంది.. బాంబ్ పేల్చిన అనసూయ