Anasuya Confessed That She Have A Disorder: ఒకవైపు తన గ్లామరస్ ఫోటోలతో నెట్టింట్లో, మరోవైపు వివాదాలతో యాంకర్ అనసూయ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఈమధ్య తను వృత్తిపరంగా బిజీ అవ్వడం వల్ల.. వివాదాల జోలికి వెళ్లడం లేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంది. ఫోటోలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంది. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా పెట్టిన వీడియోలో అనసూయ తనకో డిజార్డర్ ఉందంటూ బాంబ్ పేల్చింది. అయితే.. ఇదేమీ ఆమెకు ఫిజికల్‌గా వచ్చిన డేంజరస్ వ్యాధి అయితే కాదులెండి. ట్రోలర్స్‌కి కౌంటరిచ్చే నేపథ్యంలోనే సెటైరికల్‌గా డిజార్డర్ పదాన్ని వినియోగించింది.
Viral Video: దేశ రాజధానిలో దారుణం.. కారుతో ఢీకొట్టి.. అర కిలోమీటరు లాక్కెళ్లి..
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ‘‘నేనొక కన్ఫెషన్ చేయాలనుకుంటున్నా. నాకు ఒక డిజార్డర్ ఉంది. నా గురించి నెగెటివ్‌గా మాట్లాడే వ్యక్తుల్ని నేను పట్టించుకోను. ఇదే నా డిజార్డర్’’ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఇందులో ఉన్నది ఆమె ఒరిజినల్ వాయిస్ కాదు. ఈ వీడియో ఒక రీల్‌లో భాగం. అనసూయ లాంటి సెలెబ్రిటీలు ఈ తరహా వీడియోలనే ఎక్కువగా చేస్తుంటారు. ఇది విమర్శకుల్ని డైరెక్ట్ టార్గెట్ చేసినట్టు ఉండటంతో.. పరోక్షంగా అనసూయ నెగెటివ్ కామెంట్స్ చేసేవారికి గట్టి కౌంటరే ఇచ్చిందని ఫాలోవర్స్ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చూస్తుంటే.. తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి ఇకపై తాను సమాధానం ఇవ్వదలచుకోలేదని, అసలు ఆ కామెంట్స్‌ని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నానని అనసూయ ఇండైరెక్ట్‌గా చెప్తున్నట్టు స్పష్టమవుతోంది.
Stampede In Cuttack: జాతరలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు
కాగా.. జబర్దస్త్ షోలో గ్లామర్ డోస్‌తో పాపులారిటీ గడించిన అనసూయ, రంగస్థలం సినిమాలో తాను పోషించిన రంగమ్మత్త పాత్రతో మరింత పాపులర్ అయ్యింది. ఆ పాత్ర పుణ్యమా అని, అనసూయకి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా పుష్పలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్‌లోనూ మెప్పించింది. ప్రస్తుతం పుష్ప2, రంగమార్తాండతో పాటు ఇతర ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ నవల ఆధారంగా తెరెకెక్కుతోన్న కన్యాశుల్కం అనే వెబ్‌సిరీస్‌లోనూ అనసూయ వేశ్య పాత్రలో నటిస్తోంది.