Fake Doctor: నకిలీ డాక్టర్ పట్టా చూపించి ఓ మహిళ కొన్నాళ్లుగా రోగులకు వైద్యం చేస్తూనే ఉంది. వైద్యం ముసుగులో కొన్ని కోట్లు సంపాదించింది. ఆమె దాదాపు 20 ఏళ్లపాటు సైకోథెరపిస్ట్‌గా పనిచేసి.. 10 కోట్లకు పైగా పోగేసింది. సీన్ కట్ చేస్తే అధికారులకు పట్టుబడి కోర్టు ఎదుట తలదించుకుని నిలబడింది. జోలియా అలెమీ తాను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ తీసుకున్నట్లు నమ్మించింది. యూకేలోని మాంచెస్టర్ క్రౌన్ కోర్ట్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈమెపై అనేక ఫోర్జరీ ఆరోపణలు రావడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరు పరిచారు. పట్టుబడిన తర్వాత ఈ మహిళపై అనేక ఫోర్జరీ ఆరోపణలపై కోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే అమె వాదనలు ఫేక్ అని తేలింది.
Read Also: LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?
కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ప్రాసిక్యూటర్ క్రిస్టోఫర్ స్టేబుల్స్ మాట్లాడుతూ.. జోలియా తనను తాను నిజాయితీపరురాలిగా చెప్పుకునేదన్నారు. కానీ నిజానికి ఆమె మోసగత్తెగా ఆరోపించారు.1995లో యూకేలో రిజిస్టర్డ్ డాక్టర్ కావడానికి జోలియా డిగ్రీని ఫోర్జరీ చేసి జనరల్ మెడికల్ కౌన్సిల్ (జీఎంసీ)కి వెరిఫికేషన్ కోసం పంపిందని క్రిస్టోఫర్ కోర్టుకు తెలిపారు.
Read Also: Tragedy: విచిత్రం వారు కవలలు.. ఒకరు చనిపోగానే 900కి.మీ. దూరంలోని అతనూ చనిపోయాడు
జోలియా వయస్సు ప్రస్తుతం దాదాపు 60 సంవత్సరాలు. ఆమె UKలోని బర్న్లీ నగరంలో నివసిస్తోంది. 1998-2017 మధ్య, అతను అనేక ప్రసిద్ధ సంస్థలలో మానసిక వైద్యురాలిగా పనిచేశారు. చాలా డబ్బు సంపాదించింది. నకిలీ డాక్టరేట్ డిగ్రీ ఆధారంగా జోలియా రూ.10 కోట్లకు పైగా సంపాదించారని క్రిస్టోఫర్ కోర్టులో పేర్కొన్నారు. కోర్టు విచారణ సందర్భంగా, జోలియా తనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 17 కేసులను తిరస్కరించింది. ఆమెపై కోర్టులో విచారణ దాదాపు 5 వారాల పాటు సాగుతుందని చెబుతున్నారు. దీని తర్వాత మాత్రమే ఆమెకు శిక్ష పడుతుంది.