Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. రాజధాని పరిధిలోని అమరావతి మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం…
Minister Narayana: అమరావతి రాజధాని అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ తాజా సమీక్ష నిర్వహించి కీలక ప్రకటనలు చేశారు. నగర నిర్మాణంలో భాగంగా ఇప్పటికే అనేక నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలతో పాటు అధికారుల నివాసాల నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా.. రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ట్రంక్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. మొత్తం 360 కిలోమీటర్ల రహదారులకు టెండర్లు పిలవడం జరిగిందని మంత్రి వెల్లడించారు. Read…
ఐదేళ్లపాటూ జగన్ తుగ్లక్ పాలనను అందించారని 2014 లో టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపేశారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నిలిపేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.64 వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.