CM Chandrababu: అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు వస్తాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఒకప్పుడు హైదరాబాద్‌లోని కోకాపేటలో రూ.10,000 విలువ చేసే ఎకరం భూమి… ఇప్పుడు రూ.170 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.. జూబ్లీహిల్స్‌లో ఒక్కప్పుడు రాళ్లు, రప్పలు ఉండేవి.. కానీ, ఒక హైటెక్ సిటీ కట్టి.. ముందు అడుగు వేశాం.. మౌలిక సదుపాయాలు కల్పించాం.. ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే.. ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు.. అభివృద్ధి…
CM Chandrababu: రాబోయే 15 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి… నాది, పవన్ కల్యాణ్ ది అదే ఆకాంక్ష.. అభివృద్ధి జరగాలి అంటే స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక ప్రొగ్రామ్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.. గత పాలనలో…
Minister Anagani Satya Prasad: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఎన్టీఆర్ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ రోజు పేదల సొంతింటి కల సాకారం అవుతున్న చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు.. ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా…
Minister Kollu Ravindra: నకిలీ మద్యంపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలి అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కుట్రలు అన్నీ కృష్ణా జిల్లా నుంచి జరగడం దురదృష్టకరం అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ రావడం పట్ల లోకేష్, చంద్రబాబులను అభినందించాలని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలతో పాటు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిపై చర్చించారు బాలయ్య. పార్లమెంట్కు వెళ్లిన బాలకృష్ణ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడిగానే కాదు ప్రజాప్రతినిధిగా తన సేవా ప్రయాణం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతపై బాలకృష్ణ, స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల…
తెలంగాణ అభివృద్ధికి నేను తెచ్చిన ఐటీ విప్లవమే కారణం అని గుర్తు చేశారు. హైటెక్ సిటీ ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించాం.. ఐటీ రంగంలో తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ముందున్నారు అని పేర్కొన్నారు. సింగపూర్ ప్రజల ఉత్సాహం ఏపీ అభివృద్ధికి దోహదం కావాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
AP Metro Rail Projects: విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్కు రంగం సిద్ధం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం రేపు టెండర్లు పిలవనుంది. రూ. 21,616 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు.
పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.