కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంపురాన్. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తోలి ఆట నుండి మిశ్రమ ఫలితం రాబట్టినప్పటికీ కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. ఇతర లాంగ్వేజ్ లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు భారీ వసూళ్లు రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
Also Read : OTT : ఓటీటీ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్న స్టార్ హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ అయి నెల కాకుండానే తుడరుమ్ అనే సినిమాను రిలీజ్ చేసాడు మోహన్ లాల్. తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బెంజ్ అలియాస్ షణ్ముగం అనే క్యాబ్ డ్రైవర్ పాత్రలో మోహన్‌లాల్ నటింగా అతనికి జోడిగా అలనాటి అందాల నాయకి శోభన నటించింది. ఏప్రిల్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్బ్ టాక్ తెచ్చుకుంది. దృశ్యం తర్వాత మరోసారి అలంటి పవర్ఫుల్ కథ ను మోహన్ లాల్ ఎంచుకున్నారని అని రాసుకొచ్చారు క్రిటిక్స్. కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని ఆడియెన్స్ నుండి ప్రశంసలు వచ్చాయి. టాక్ తో పాటు తోలి రోజు హౌస్ ఫుల్స్ తో నడుస్తున్న తుడరమ్ తెలుగులో మాత్రం ఒకరోజు ఆలస్యంగా నేడు అనగా 26న రిలీజ్ అవుతోంది. ఇలా కేవలం ఒక నెల రోజుల వ్యవదిలో రెండు బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్నాడు మోహన్ లాల్.