Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా వాణిలో చిన్నారులు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాలో ఉన్న పార్కును డెవలప్ చేయాలని అధికారులకు విన్న విన్నవించారు. ఇన్ని రోజుల పాటు కబ్జాలో ఉన్న పార్కు స్థలాన్ని పోలీసులు, అధికారులు కాపాడారని తెలిపారు.
ప్రజావాణి పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో 54,619 అర్జీలు ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4% (37384) అర్జీలు పరిష్కారమయ్యాయి. ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శకమైన విధానాలు అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని సీఎం కోరారు. లైవ్ యాక్సెస్…
అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటి స్థలంపై వేసిన మార్కు గురించి పునరాలోచన చేయాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. రోడ్డు విస్తరణలో భాగంగా చంద్రశేఖర్ రెడ్డి ప్లాట్కు అధికారులు మార్క్ చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిల్మ్ నగర్…
తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని లేనిపక్షంలో కారుణ్య ఆత్మహత్యకు అయినా అనుమతించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత అనే మహిళ ప్రజావాణిని ఆశ్రయించింది. ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలతో ఉపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు మానసిక దివ్యాంగులు కావడంతో తన భర్త ఉపాధి కొరకు గల్ఫ్ దేశానికి వలస వెళ్లినట్లు సునీత తెలిపింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది. పీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే అనవాయితీ కొనసాగింది. గాంధీభవన్‌లో వారానికి రెండు రోజులు మంత్రులు వచ్చి...ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించారు.
Prajavani Program: నేడు గాంధీభవన్ లో మంత్రుల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు.
గాంధీ భవన్‌లో మొదటి రోజు ముఖాముఖి కార్యక్రమంలో ముగిసింది. ఈ సందర్భంగా 285కు పైగా అప్లికేషన్లు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. హెల్త్ ఇష్యూస్, 317 బాధితులు, భూ వివాదం, అక్రమ కేసులు, బదిలీలు అంటూ ఫిర్యాదు అందాయి. బీఆర్‌ఎస్ హయంలో రౌడీ షీట్ పెట్టారంటూ మంత్రి ముఖాముఖిలో సిరిసిల్లకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడు. కేటీఆర్ తనపై తప్పులు కేసులు నమోదు చేశాడని ఫిర్యాదు చేశాడు సదరు యువకుడు. 30 ఫిర్యాదులను అప్పటికప్పుడు అధికారులకు ఫోన్…
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చిందని.. ఆ కార్యక్రమ పురోగతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడారు. 50 వారాలుగా ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణికి అందిన దరఖాస్తులు 5,23,940 కాగా.. అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని, మిగిలినవి 92,592 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని వెల్లడించారు.