Off The Record: ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది….. కానీ దాని పర్యవసానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌పై చర్యల విషయంలో రచ్చ జరిగింది. తర్వాత మంత్రి దంపతులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి క్షమాపణలు చెప్పేశారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయినా… తెర వెనక అసలేం జరిగిందన్న నివేదిక మాత్రం ప్రభుత్వం దగ్గరే ఉండి పోయింది. దీంతో… కొండా ఎపిసోడ్‌లో వాస్తవాలేంటి..? బాధ్యులు ఎవరు,.. బద్నాం అయ్యింది ఎవరు..? సురేఖ…
Off The Record : కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయినట్టేనంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలిచి మాట్లాడాక ఎపిసోడ్ మొత్తం సెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో సురేఖ… మురళి చేసిన లొల్లి కంటే….. వాళ్ళ కూతురు సుస్మిత చేసిన గొడవే పెద్ద రచ్చకు దారి తీసింది. పైగా ఇది బీసీ వర్సెస్ రెడ్లు టర్న్ అవుతోందన్న సంకేతాలు…
Off The Record: వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ మొదలైంది. ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. భద్రకాళి అమ్మవారి ఆలయ పాలకమండలి ఏర్పాటు మంత్రి కొండా సురేఖకు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మధ్య అగ్గి రేపింది. అమ్మవారి ఆలయం పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న క్రమంలో… అక్కడి కార్యకర్తలు పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అనుచరులు సైతం లైన్‌లోకి వచ్చారు.…
కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. దీంతో ఆయే నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీ కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇంచార్జీ కి వివరణ ఇచ్చారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్…
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఇది ఎక్కడో మొదలైంది గానీ.. చివరికి ఎట్నుంటి ఎటు వెళ్తోందన్నది మాత్రం అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అయితే.. వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధుల యుద్ధం హస్తిన దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు.. జిల్లా ఎమ్మెల్యేలు. ఈ ఆధిపత్య పోరు చాలా పెద్ద రచ్చకే దారితీస్తోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
తెలంగాణలో కులమత సంప్రదాయాలు పక్కదారి పడుతున్నాయని.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతతో పాటు యోగాసనాలు ఫాలో అవ్వాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో క్రిస్‌మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో క్రిస్టియన్ సోదరి, సోదరిమణులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని.. రోజుకో శాఖను తాను పరిశీలిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూస్తున్నారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు.
మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారు.. అమాయకులను బలి చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అధికారులను విదేశాల్లో దాచారని మంత్రి కొండా సురేఖా అన్నారు. బీఆర్ఎస్ ది తుగ్లక్ పాలన.. బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టిందని దుయ్యబట్టారు.