Minister Kakani Govardhan Reddy Fires on Chandrababu
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు దాడి తెలుగు ప్రజలు అందరు గుర్తుపెట్టుకొని ఉన్నారన్నారు. అంతేకాకుండా.. చంద్రబాబుపై ఎన్టీఆర్ అనేక సార్లు చంద్రబాబు వల్ల బాధపడ్డానని చెప్పారు. చంద్రబాబుకి సిగ్గు, శరం వంటివి ఏమీ లేవు. వైఎస్సార్ చేయూత ద్వారా చేయూతని అందిస్తుంటే నిన్న ధర్నా కార్యక్రమం పెట్టించారు. ఎన్టీఆర్ ని ఎంత అవమానించారో క్రెడిబులిటీ ఉన్న టీడీపీ నాయకులు ఆలోచించాలి. ఆరోగ్యశ్రీ పేరుని ఎందుకు మార్చావ్, ఎందుకు మార్చావ్ అని అడిగామా. నిద్రలేస్తే నోట్లో నుంచి అబద్ధం తప్ప ఒక్కనిజం కూడా చంద్రబాబు చెప్పరు. లోకేష్ గడ్డం పెంచి పెద్ద పులిలా గర్జిస్తున్నాడు, ప్రజలు ఛీ కొడుతున్నారు లోకేష్. చంద్రబాబు నీచ చరిత్ర గురించి ప్రజలందరికి తెలుసు. వైద్య సేవల కోసం తెలుగు రాష్ట్రాల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్ దే. కృష్ణపట్నంకి వచ్చి ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు కూల్చేస్తామని అధికారంలోకి రాకముందు చంద్రబాబు చెప్పారు.
అధికారంలోకి వచ్చాక అదే కృష్ణాపట్నంకి వచ్చి ధర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించి మా వల్లే అభివృద్ధి అన్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన పట్ల ముసలి కన్నీరు పెడుతుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. ఎన్టీఆర్ పై మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, అందుకే జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాం. కుప్పo లో చంద్రబాబు ఓడిపోతారు.. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయరు. అక్కడ ఆయన పని ఐపోయింది. అక్కడి ప్రజలు చంద్ర బాబును తరిమికొడతారు. టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. చంద్రబాబు అసెంబ్లీ గడప కూడా తొక్కలేరు అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.