Minister Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా మారుస్తాడు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. వెంకటపాలెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగ రాస్తున్నారు.. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండాలంటే చంద్రబాబు సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అన్నాడు.. కానీ, రాజధానిలో జగన్ 50 వేల మందికి ఇళ్లు కట్టిస్తున్నారు.. పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. కుక్కలకు కూడా సీజన్ ఉంటుంది.. చిత్తకార్తి సమయంలో కుక్కలు కూడా రోడ్డు మీదకు వచ్చి మొరుగుతాయి.. ఇటువంటి చిత్తకార్తి కుక్కలు ఎన్నికల సీజన్ లో రోడ్డు మీదకు వస్తున్నాయి అంటూ మండిపడ్డారు.
Read Also: CPI Narayana: మునిగిన పడవపై పవన్, చంద్రబాబు.. మేం సపోర్ట్ చేయం..!
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ముసలి నక్క , పవన్ కల్యాణ్ పిచ్చికుక్క, పవన్ కల్యాణ్ పెళ్లాలనే కాదు పార్టీలను కూడా మారుస్తాడు అంటూ ఫైర్ అయ్యారు. మార్చటం, తార్చటం పవన్ కల్యాణ్ వెన్నతో పెట్టిన విద్య అన్న ఆయన.. ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి కంపెనీ పెట్టు.. ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడు.. గూడు కల్పిస్తున్నాడు.. జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు. మా వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊరపంది తిరిగినట్లు ఒకడు రోడ్ల పై తిరుగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.