సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈసారి ఎన్నికల్లో పోటీ ఉంటుందన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలు అని విమర్శించారు. ధరణి వద్దు అని అంటే పటేల్ వ్యవస్థ మళ్ళీ తెచ్చినట్టేనని మంత్రి పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఈసారి కచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగారేస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Hamas-Israel war: సీసీ కెమెరాకు చిక్కిన హమాస్ క్రూరత్వం.. బయటపెట్టిన ఇజ్రాయిల్
ఇంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ధరణి కామెంట్లపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ తమ నాన్న కంప్యూటర్ తెచ్చారు అన్నారన్నారు. తాము కూడా ధరణిని కంప్యూటరీకరణ చెస్తే వద్దంటారు అని తెలిపారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ అంటుందని.. ధరణిని వ్యతిరేకిస్తే ప్రజలే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారని మంత్రి హరీష్ రావు అన్నారు.
Read Also: Purandeshwari: ఏపీ ఆర్థిక అంశాలపై నిర్మలా సీతారామన్ కి బీజేపీ ఏపీ చీఫ్ వినతి పత్రం