Hamas-Israel war: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడుల్లో 1400 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులను హమాస్ బంధించింది. హమాస్ విచక్షణారహితంగా మానవత్వం మచ్చుకైనా లేని విధంగా ఇజ్రాయిల్ పైన విరుచుకు పడింది. చిన్న పెద్ద తేడాలేకుండా కనిపించినవాళ్ళని కనిపించినట్టు చంపేసింది. హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వానికి సాక్ష్యంగా వాళ్ళు చేసిన అకృత్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోని ఇజ్రాయిల్ బయటపెడట్టింది. వివరాలలోకి వెళ్తే ఇజ్రాయిల్ హమాస్ పైన ప్రతీకార దాడులు జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ గాజా పైన చేసిన దాడుల్లో 4500 మందికి పైగా మరణించారు. గాజా పరిస్థితి దయనీయంగా మారింది.
Read also:Bihar Crime News: దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురు మృతి
ఈ క్రమంలో ఇజ్రాయిల్ మానవత్వం అనేదే లేకుండా హమాస్ పైన విరుచుకు పడుతుందని ఇజ్రాయిల్ ని విలన్ గా చిత్రీకరించే విధంగా హమాస్ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రజలపై హమాస్ చేసిన దురాగతాలను ప్రంపంచానికి చాటి చెప్పేందుకు తాము ఇలా హమాస్ పైన దాడి చేయడంలో న్యాయం ఉంది అంటూ ఇజ్రాయిల్ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో డ్యూరేషన్ 43 నిముషాలు ఉంది. ఆ వీడియో చూసిన జర్నలిస్టులు సైతం కంటతడి పెట్టుకున్నారు అంటే హమాస్ క్రూరత్వం ఏ స్థాయిలో ఉందొ అంచనా వేయొచ్చు. ఆ వీడియోలో హమాస్ ఉగ్రవాదులు కనికరం లేకుండా నిర్లక్ష్యంగా ఇజ్రాయిల్ రహదారులపై నావిగేట్ చేస్తూ.. నిరాయుధులైన అమాయక పౌరులపై నిర్మొహమాటంగా కాల్పులు జరుపుతున్నాయి. అమాయక పౌరుల ప్రాణాలను తీస్తూ అల్లా హు అక్బర్ అంటూ హమాస్ ఉగ్రవాదులు చేసిన నినాదాలను వీడియోలో చూడవచ్చు.
Read also:US: H-1B వీసా ప్రక్రియలో US కొత్త ప్రతిపాదనలు ఇవే ..
ఆ వీడియో క్లిప్‌లో ఒక తండ్రి భయంతో తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని బాంబు షెల్టర్ లోకి వెళ్తాడు. అనంతరం హమాస్ గ్రెనేడ్ విసరగా ఆ తండ్రి చనిపోతాడు. అతని కుమారులు రక్తపాతంలో, తండ్రిని చూస్తూ ఏడుస్తుంటే మనిషన్న వాడు ఎవడైనా చలించిపోతాడు. భయంతో ఆ పిల్లలు అరుపులు ఆర్తనాదాలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి. కాగా వర్ణానాతీత వేదనతో కూడిన ఈ క్షణంలో, హమాస్ ముష్కరుడు వారి ఇంటిపై దాడి చేసి, నిర్లక్ష్యంగా ఫ్రిజ్‌ని పరిశీలిస్తూ.. కోక్ బాటిల్‌ను తీసి.. బయలుదేరే ముందు ఒక సిప్ తాగాడు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు ఆ వీడియోలో ఎన్నో ఉన్నాయి.