CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేల నోటి నుంచి వచ్చిన మాటలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. సీనియర్, జూనియర్ అన్న తేడా లేదు. అందరిదీ అదే రాగం. అధికారులు మా మాట వినడం లేదన్నదే బాధ. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే... మంత్రి పార్థసారధి కూడా మీరంతా నాకు చెబుతున్నారు సరే... నేనెవరికి చెప్పుకోవాలన్నట్టుగా మాట్లాడారట. ఇదంతా చూస్తున్నవాళ్ళు మాత్రం విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు కేరక్టర్‌ని గుర్తు చేసుకుంటున్నారు. అందులో బాధితులంతా ఎమ్మెల్యే…
రాజధాని విస్తరణకోసం రెండో విడత గ్రామసభలో అధికారులకు నిరసన సెగ తాకింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారుల ఎదుట నిరసనకు దిగారు స్థానికులు.. గ్రామ సభ నిర్వహించడానికి వీల్లేదంటూ పొన్నెకల్లులో రైతులు ఆందోళనకు దిగారు..
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.…
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో రెండవ రోజు ఇంటింటి సర్వే కొనసాగనుంది. వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
AP Govt: అన్నమయ్య జిల్లాలోని పీలేరు చుట్టు పక్కల ఉన్న ఆరు గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన నాలుగు వందల కోట్ల ప్రభుత్వ భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఎట్టకేలకు బాంబు శబ్ధాలకు గాజాలో పుల్‌స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. హమాస్ అంతమే లక్ష్యంగా రాకెట్ దాడులు చేసింది. దీంతో ఆస్తుల ధ్వంసంతో పాటు వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.
వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ లో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరస్పర విబేధాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.