AP Assembly Speaker: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.. ఈ నెల 19వ తేదీన తుది విచారణ ఉంటుందంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందుగానే సంబంధిత రెబల్స్‌కు సమాచారం ఇచ్చినా.. ఎవరూ హాజరు కాకపోవడంపై.. స్పీకర్ సీరియస్ అయిన విషయం విదితమే.. న్యాయ నిపుణుల సలహా తీసుకుని.. వారిపై చర్యలకు సిద్ధం అవుతున్నారు స్పీకర్.. ఈ నేపథ్యంలోనే రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ తమ్మినేని సిద్ధం అవుతున్నారు.. అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్టేనని స్పష్టం చేశారు..
Read Also: AKhilesh: ఇండియా కూటమికి మళ్లీ షాక్.. మరో 9 మంది అభ్యర్థుల ప్రకటన
ఈ మేరకు 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నుంచి తాజాగా లేఖలు వెళ్లాయి.. విచారణకు అవకాశం ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేదని లేఖల్లో వెల్లడించారు స్పీకర్. ఈ నెల 19వ తేదీన చివరి విచారణ ఉంటుందన్నా.. హాజరు కాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు.. అవకాశాలిచ్చినా విచారణకు హాజరు కాలేదనే విషయాన్ని పేర్కొన్నారు. ఇక విచారణ ఉండవని లేఖల్లో సంకేతాలు ఇచ్చారు.. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని స్పష్టం చేశారు.. ప్రస్తుతానికి అనర్హత పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వులో పెట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. అయితే, రెబల్ ఎమ్మెల్యేలకు ఫైనల్ గా ఓ లెటర్ రాసిన స్పీకర్ తమ్మినేని ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.