స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ పైకి ఎదిగిన కోలీవుడ్ యంగ్ యాక్టర్ కవిన్. టెలివిజన్ హోస్ట్ నుండి బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా మరింత కనెక్టయ్యాడు. అక్కడ నుండి అతడి లైఫ్ టర్న్ తీసుకుంది. లిఫ్ట్, దాదా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు కవిన్ కు. హీరో కావాలనుకున్న సగటు అబ్బాయి కథతో వచ్చిన స్టార్.. రియల్లీ అతడ్ని స్టార్ హీరోగా మార్చింది. అలాగే సరికొత్త కాన్సెప్టుతో వచ్చిన బ్లడీ బెగ్గర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కాసుల వర్షం కురిపించలేదు. ప్రెజెంట్ ఈ యంగ్ టాలెంట్ చేతిలో మూడు సినిమాలున్నాయి. మాస్క్ తో పాటు కిస్, నయనతారతో మరో మూవీకి కమిటయ్యాడు. వీటిల్లో కిస్ షూటింగ్ కంప్లీటైంది. రీసెంట్లీ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్
The Devil’s Chair: సంతోషపడాలా? బాధపడాలా? అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇందులో లవ్వు, గివ్వు అంటే పడని అబ్బాయిగా కనిపించాడు కవిన్. అలాగే కిస్ అనే పదమే ఎరుగని కుర్రాడిగా డిజైన్ చేశాడు దర్శకుడు. అసలు అలాంటి వాళ్ళు ఉంటారా? అనే అనుమానం కలుగుతోన్ది కదా. అలాంటి వ్యక్తి ఉంటే పరిస్థితి ఏమిటి? అనే లైన్ మీదనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా కోసం కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ ఫస్ట్ టైం కెమెరా పట్టబోతున్నాడు. ఇందులో తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా ఎదిగిన ప్రీతి అస్రాని హీరోయిన్. ఈ సినిమాను మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.