Maruti Suzuki: పండగ సమయాల్లో వాహన కొనుగోలు చేయడం భారతీయులకు ఎప్పుడునుంచో ఉన్న అలవాటు. ఫెస్టివల్ సీజన్ సమయంలో కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించడం దీనికి ప్రధాన కారణం. దసరా, దీపావళి వంటి పండగల సందర్భంగా భారీగా అమ్మకాలు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, మారుతీ సుజుకీ ఇండియా 2025 జనవరి నెలలో ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. కొత్త సంవత్సరం ప్రారంభం, సంక్రాంతి పండగ, రిపబ్లిక్ డే సందర్భాలను పురస్కరించుకుని 2024, 2025 మోడళ్లపై గరిష్టంగా రూ. 2.15 లక్షల వరకు తగ్గింపులు అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ఇచ్చారో ఒకసారి చూద్దామా..
Also Read: Suresh: నదియాతో ప్రేమ.. రహస్యంగా బట్టబయలు చేసిన నటుడు!
మారుతీ ఇన్విక్టో (Invicto) 2024 మోడల్‌పై ఏకంగా రూ. 2.15 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. అది ఏ విధంగా తగ్గుతుందంటే.. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 1 లక్ష, స్క్రాపేజ్ బోనస్ కింద రూ. 11,500 కింద అందిస్తున్నారు. అయితే 2025 మోడల్‌పై ఎటువంటి ప్రత్యేక తగ్గింపు అందించడం లేదు. అలాగే మారుతీ బాలెనో (Baleno) 2024 మోడల్ పై రూ. 62,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ. 40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్ బోనస్ గా రూ. 20,000, ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో రూ. 15,000 లభిస్తాయి. అదే 2025 మోడల్ పై రూ. 20,000 వరకు తగ్గింపులు కూడా అందుతాయి.
అలాగే మారుతీ జిమ్నీ (Jimny) 2024, 2025 మోడళ్లపై రూ. 1.9 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే, జిమ్నీపై ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ లాంటి అదనపు ఆఫర్లు అందుబాటులో లేవు. ఇక అలాగే పాపులర్ కారు గ్రాండ్ విటారా (Grand Vitara) 2024 మోడల్‌పై రూ. 65,000 వరకు, 2025 మోడల్‌పై రూ. 25,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందుల పెట్రోల్ + హైబ్రిడ్ వేరియంట్లపై స్క్రాపేజ్ బోనస్ కింద రూ. 50,000 , ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 65,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదండోయ్.. కార్పొరేట్ డిస్కౌంట్స్, గ్రామీణ బోనస్‌లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి రూ. 3,100 వరకు ప్రత్యేక తగ్గింపులతో మొత్తం 1.18 లక్షల వరకు ఆఫర్ లభిస్తుంది.
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్!
మారుతీ సుజుకీ కార్లు తమ తక్కువ ధర, అధిక మైలేజ్ కారణంగా మధ్య తరగతి ప్రజలకే కాకుండా కార్ల ప్రియులకు కూడా మొదటి ఎంపికగా ఉంటాయి. ఈ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకుని, కొత్త సంవత్సరంలో మీ కలల కారును ఇంటికి తెచ్చుకోవడం కోసం ఇది మంచి అవకాశం. మారుతీ సుజుకీ తీసుకువచ్చిన జనవరి ఆఫర్లు కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి నిజంగా బంపర్ ఆఫర్. ఇంతటి తగ్గింపులు, ప్రత్యేక డిస్కౌంట్లు పండగ కాలం కాకుండా అందుబాటులో ఉండటంతో, ఈ అవకాశం కోల్పోకుండా మీ కొత్త కారును ఇంటికి తెచ్చేసుకోండి.