Maruti Suzuki: పండగ సమయాల్లో వాహన కొనుగోలు చేయడం భారతీయులకు ఎప్పుడునుంచో ఉన్న అలవాటు. ఫెస్టివల్ సీజన్ సమయంలో కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించడం దీనికి ప్రధాన కారణం. దసరా, దీపావళి వంటి పండగల సందర్భంగా భారీగా అమ్మకాలు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, మారుతీ సుజుకీ ఇండియా 2025 జనవరి నెలలో ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. కొత్త సంవత్సరం ప్రారంభం, సంక్రాంతి పండగ, రిపబ్లిక్ డే సందర్భాలను పురస్కరించుకుని…