టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే? ఆయన నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో మెప్పించి సుమారు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. నిజానికి కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. ప్రస్తుతం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే సీరియల్స్‌లోనూ పలు కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే ఆయన తాజాగా అప్పటి హీరోయిన్ నదియాతో ఉన్న రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సురేష్ తనపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించారు. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతో ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది.
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్!
నదియా బాయ్‌ఫ్రెండ్ పేరు శిరీష్, నాది సురేష్, షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడేది. అందరూ నాతోనే అనుకునే వారని ఆయన అన్నాడు. తర్వాత నదియా శిరీష్‌ని పెళ్లి చేసుకుంది. నదియా నాకు చెల్లెలు లాంటిది కాబట్టి నాకు, నదియాకి మధ్య రొమాన్స్‌కు అవకాశం లేదు. సినిమాలో సాఫ్ట్ గా ఉన్నా, నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రం ఆమె గట్టిగానే మాట్లాడుతుందని ఆయన అన్నారు. ఆమెకు లైఫ్ లో క్లారిటీ ఉంది. ఇన్నాళ్లు సినిమాల్లోనే ఉండాలని, ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాక మళ్లీ సినిమాల్లో నటించాలని స్పష్టమైన ఆలోచనతో ఉందని సురేష్ అన్నారు. మేము ఇప్పటికీ స్నేహితులమే అని మాకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని అన్నారు. మా 80’’స్ వాట్సాప్ గ్రూప్‌లో రజనీ సర్ కూడా ఉన్నారు’’ అని నటుడు సురేష్ అన్నారు.