Maruti Brezza vs Honda Elevate : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. ఏ కారు కొనాలన్న సందిగ్ధంలో ఉన్నారా.. అయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ దగ్గర రూ.12 లక్షల బడ్జెట్ మాత్రమే ఉంటే.. ఆ రేంజ్ లో వస్తున్న రెండు కార్ల గురించి తెలుసుకుందాం. మారుతి సుజుకి బ్రెజ్జా ధర రూ. 8 లక్షలు. కానీ ఇందులో దాదాపు రూ. 12 లక్షల ధరకు లభించే హోండా ఎలివేట్ వంటి ఫీచర్లను పొందవచ్చు. మారుతి సుజుకి బ్రెజ్జా, హోండా ఎలివేట్‌లలో చాలా ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. వాటి పొడవు, వెడల్పు, గ్రౌండ్ క్లియరెన్స్, ఎత్తు, వీల్‌బేస్, బూట్ స్పేస్, ఇంజిన్, మైలేజ్, ధర పూర్తి వివరాలు ఈ కథనంలో అందుబాటులో ఉన్నాయి.. ఇవన్నీ చూసిన తర్వాత ఏ కారు కావాలో ఎంచుకోవచ్చు.
మారుతి బ్రెజ్జా vs హోండా ఎలివేట్
ఈ రెండు కార్ల పొడవు, వెడల్పును పరిశీలిస్తే.. మారుతి సుజుకి బ్రెజ్జా పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,790 మిమీ, ఎత్తు 1,685 మిమీ. హోండా ఎలివేట్ కారు పొడవు 4,312 మిమీ, వెడల్పు 1,790 మిమీ, ఎత్తు 1,650 మిమీ.
Read Also :Jani Master Case: 4ఏళ్ల తర్వాత జానీ మాస్టర్‌పై కేసు పెట్టడానికి కారణం ఇదే.. స్పందించిన బాధితురాలు..
రెండు కార్లలో ఇంజిన్, మైలేజ్
బ్రెజ్జాలో 1,462సీసీ ఇంజిన్ ఉంటుంది. దీని మైలేజ్ లీటరుకు 17.38 కిలోమీటర్లు. హోండా ఎలివేట్ 1,498సీసీ ఇంజిన్‌తో లభిస్తుంది. ఈ కారు లీటరుకు 15.31 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
బ్రెజ్జా, ఎలివేట్‌లో కలర్ ఆఫ్షన్లు
మారుతి ఈ పవర్ ఫుల్ కారులో 10కలర్ ఆఫ్షన్లు ఉంటాయి. ఇందులో సిజ్లింగ్ రెడ్, బ్రేవ్ బ్రౌన్, ఎక్స్ బరెంట్ బ్లూ, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్ వంటి రంగులు ఉన్నాయి. హోండా ఎలివేట్‌లో 11కలర్ ఆఫ్షన్లు లభిస్తాయి. ఇందులో మూడు డ్యూయల్ టోన్ కలర్స్, ఏడు మోనోటోన్ కలర్స్ ఉన్నాయి.
Read Also :UK: లండన్‌లో ఇండియన్స్ VS ఖలిస్తానీలు.. రాయబార కార్యాలయం ముందు ఉద్రిక్తత..
ధరలో తేడా
మారుతి సుజుకి బ్రెజ్జా ధర గురించి మాట్లాడుకుంటే.. ఈ కారు ప్రారంభ ధర రూ. 8.34 లక్షలు. హోండా ఎలివేట్ ధర రూ. 11.73 లక్షలు.
బ్రెజ్జా vs ఎలివేట్: NCAP రేటింగ్
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. హోండా ఎలివేట్‌ను గ్లోబల్ NCAP ఇంకా పరీక్షించలేదు. కానీ దీనికి ASEAN NCAP పరీక్షలో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. పైన ఇచ్చిన వివరాల ప్రకారం ఏ కారు కొనాలో మీరే నిర్ణయించుకోవచ్చు.