తెనాలి టూ టౌన్ పోలీసులు పెద్దమొత్తంలో గంజాయి పట్టుకున్నారు. ఐతానగర్ ప్యాడిసన్ పేట కమ్యునిటీ హాలు వద్ద ఐలా శ్రీనివాస్, మరో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కమ్యునిటీ హాలు వద్ద కూర్చుని తమ వెంట తెచ్చిన గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మారుస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు. నర్సీపట్నం నుండి గంజాయి తీసుకువచ్చి స్ధానికంగా విక్రయిస్తున్న ముఠాను తెనాలి టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ధానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను డిఎస్పీ కె స్రవంతి రాయ్ తెలియజేశారు.
Also Read : Indore: రామనవమి రోజున అపశృతి.. ఆలయం మెట్లబావిలో పడి నలుగురు మృతి..
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం…ఐతానగర్‌కు చెందిన ఐలా శ్రీనివాస్ గతంలో గంజాయి, దొంగతనం, హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. నర్సీపట్నం నుండి విష్ణు అనే వ్యక్తి ద్వారా గంజాయి దిగుమతి చేసుకుని చిన్నపొట్లాలుగా మార్చి విక్రయాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఐతానగర్‌లోని ప్యాడిసన్ పేటలో గల కమ్యూనిటీ హాలు వద్ద మరో ఐదుగురితో కలిసి గంజాయిని చిన్నపొట్లాలుగా మార్చి విక్రయాలు చేస్తుండగా టూ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ బి శివరామయ్య సిబ్బందితో కలిసి ఘటనాస్దలానికి వెళ్లి ప్రధాన నిందితుడు ఐలా శ్రీనివాస్‌తో పాటు నందులపేటకు చెందిన దేవరకొండ మను శివ శంకర్, ఐతానగర్‌కు చెందిన తాడికొండ చంద్రశేఖర్, తాతపూడి సునీల్, పల్లె సంజయ్, వల్లభాపురపు సునీల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 15 కేజీల జంగాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు.
Also Read : Karnataka Elections: సిద్ధరామయ్యపై మాజీ సీఎం కుమారుడి పోటీ..!