పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ టెండర్ల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్ల లో స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేరుకు పోయిన ధాన్యాన్ని వేలం వేయడానికి పిలిచిన టెండర్లలో జరిగిన అక్రమాల్లో సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి…
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక భూ అక్రమాలు జరిగాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ తో పాటు హైదరాబాద్ చుట్టూ ఓ ఎమ్మెల్సీ వందల ఎకరాలు కబ్జా చేశారని కథనాలు వచ్చాయన్నారు. దీనిపై కేటీఆర్, హరీశ్ రావు స్పందించలేదని ఆయన అన్నారు. ఇలాంటి వారిని పెద్దల సభకు పంపి ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసిందని విజయ రమణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే ఏమీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు…