రెండు సంవత్సరాల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ‘డీజే టిల్లు’ అంటూ ఓ చిన్న సినిమా విడుదలైంది. అయితే అందులో ఉన్న కామెడీ టైమింగ్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ ను చూసి ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు అఖండ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా రూపొందించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమా చేసిన ఇంపాక్ట్ తో రెండో సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయకుండా వారు ఊహించదానికి కంటే ఎక్కువ కంటెంట్ తో సినిమాను తెరకెక్కించారు.
Also Read: Sri Lanka Record: శ్రీలంక టీమ్ అరుదైన ఘనత.. 48 ఏళ్ల భారత్ రికార్డు బ్రేక్!
ఈ సినిమాకు మల్లి క్ రామ్ దర్శకత్వం వహించగా.. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్, సీతారాం ఎంటర్ప్రైజెస్ పతకలపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశి లు సినిమాను నిర్మించారు.
Also Read: SSMB 29 Movie : జక్కన్న -మహేష్ మూవీ కథ కాపీనా? ఎక్కడ నుంచి తీసుకున్నారో తెలుసా?
భారీ అంచనాలతో టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది సినిమా. రెండు గంటల పాటు నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైన్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇక ఈ సినిమా వసుళ్లపరంగా సంచలనాలను సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 23.7 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు మొత్తం 45.3 కోట్లను గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక నేడు మూడు రోజులు ముగిసే సమయానికి టిల్లు స్క్వేర్ 68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది. దీంతో అతి త్వరలో 100 కోట్ల క్లబ్బులో చేరిబోతున్నాడు సిద్దు జొన్నలగడ్డ.