ఆర్కియాలజీ లైబ్రరీల గురించి అసెంబ్లీలో ప్రశ్నోత్నరాల సమాయంలో చర్చ సాగింది.. రాష్ట్ర విభజన జరిగినప్పుడు.. ఆస్తి, అప్పుల విభజనలో ఏపీకి ఆర్కియాలజీ లైబ్రరీకి సంబంధించి సాంస్కృతిక సంపద పూర్తిగా రాలేదని లేవనెత్తారు జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. ప్రభుత్వం వెంటనే ఆర్కియాలజీ శాఖ లైబ్రరీపై దృష్టి పెట్టాలని కోరారు.. ఇక, మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర విభజన తర్వాత 50 శాతం ప్రాచీన పత్రాలు రాష్ట్రానికి…
అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? తమకే సీటు కేటాయించాలంటూ స్థానికల నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో.. అసలు టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోన్న తరుణంలో.. ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది జనసేన పార్టీ.. అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేసింది జనసేన అధిష్టానం..
పిఠాపురంలో పవన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.