భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.