ఇండోనేషియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. సైన్యానికి సంబంధించిన కాలం చెల్లిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది. దీంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Jayam Ravi : జయం రవి వైఫ్‌కి.. గట్టి వార్నింగ్ ఇచ్చిన సింగర్ కెనీషా
ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని గరుట్ రీజెన్సీలో మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారని సైనిక అధికారి తెలిపారు. జకార్తా సమయం ప్రకారం ఉదయం 09:30 గంటలకు గరుట్ రీజెన్సీలోని సాగర గ్రామంలో ఈ ఘోరం జరిగింది. బాధితుల్లో నలుగురు సైనికులు, తొమ్మిది మంది నివాసితులు ఉన్నారని ఇండోనేషియా ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ వాహ్యు యుధాయన పేర్కొన్నారు. బాధితులందరినీ పమెంగ్‌ప్యూక్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తొలుత రెండు చోట్ల పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారని.. మూడో చోట చేస్తుండగా ఊహించని విధంగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా వివరించారు. సైనిక బృందం గతంలో అనేక మార్లు తనిఖీ చేశారని.. సురక్షితమైన స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Operation Sindoor: భారత్ దాడిలో 11 మంది సైనికులు మరణించారు.. 78 మంది గాయపడ్డారు.. అంగీకరించిన పాక్