Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాలకు ముగింపు పలికినట్టేనా.. ఈ మధ్య ఎలాంటి గొడవలు పెద్దగా బయటకు కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భైరవం, కన్నప్ప సినిమాల నుంచే అంతా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. మోహన్ బాబు, విష్ణు కూడా వరుస స్టేట్ మెంట్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించట్లేదు. కన్నప్ప సినిమాను చూసి మరీ మనోజ్ విష్ణు నటనను మెచ్చుకున్నాడు.…
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.