Ranchi Test: కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతడిపై వేటు తప్పదు! యశస్వి డౌటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar Likely to Drop in Ranchi Test for KL Rahul: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫిబ్రవరి 23 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది. రెండు వరుస విజయాలు సాదించిన భారత్.. రాంచీలో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే టీమిండియా కూర్పులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రజత్ పటీదార్‌పై వేటు పడే అవకాశం ఉంది.
మొదటి టెస్టులో గాయపడిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఫిట్‌నెస్ కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాహుల్ రాంచీ టెస్ట్ మ్యాచ్‌లో ఆడుతాడు. దాంతో గత రెండు టెస్టుల్లోనూ విఫలమైన రజత్ పటీదార్‌పై వేటు పడుతుంది. ఎందుకంటే పటీదార్ రెండు టెస్టుల్లో కలిపి 46 పరుగులు మాత్రమే చేశాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న అతడు పేలవ షాట్ ఆడి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (డబుల్ సెంచరీ), సర్ఫరాజ్ ఖాన్ (హాఫ్ సెంచరీ)లు అద్భుతంగా ఆడిన ఇదే పిచ్‌పై పటీదార్ ఇబ్బంది పడటం గమనార్హం.
Also Read
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
Also Read: Chiranjeevi: లాస్ ఏంజిల్స్‌లో ‘మెగాస్టార్’ చిరంజీవికి ఘన సన్మానం!
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్ రాంచీ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాక వెన్ను నొప్పితో మైదానం వీడిన అతడు.. తర్వాతి రోజు వచ్చి డబుల్ సెంచరీ చేశాడు. అయితే నాలుగో ఇన్నింగ్స్ ఫీల్డింగ్ సమయంలో జైస్వాల్ అసౌకర్యంగా కనిపించాడు. వెన్ను పట్టుకుని పనిపించాడు. దీంతో అతనికి విశ్రాంతినిచ్చి.. చివరి టెస్టుకల్లా ఫిట్‌గా ఉంచేలా మేనేజ్‌మెంట్ ప్రయత్నాల చేస్తోందని తెలుస్తోంది. ఒకవేళ జైస్వాల్‌కు విశ్రాంతిని ఇస్తే.. ఓపెనర్‌గా దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ రజత్ పటీదార్‌కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే.. గిల్ ఓపెనర్‌గా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
-
Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
-
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!