Indians Trapped: పొట్ట కోటి కోసం దేశం కానీ దేశం వెళ్తే అక్కడ సైబర్ నెరగాళ్లు బంధించి బలవంతంగా పని చేయించారు.. కనీసం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏర్పాటు కూడా చేయలేదు. ఏకంగా ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళని బందీలుగా చేసి వాళ్ళ చేత బలవంతంగా సైబర్ నేరాలు చేయించిన వాళ్లకి చివరికి విముక్తి కలిగింది. ఉపాధితో పాటు మంచి వసతి కల్పిస్తామంటూ ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఉంటాయని చెప్పి మయన్మార్ వరకు తీసుకువెళ్లి అక్కడ తమ పాస్ పోర్టులను గుంజుకొని ఏకంగా సైబర్ నేరాలు చేయించిన ముఠాల నుంచి బాధితులకు విముక్తి లభించింది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో మయన్మార్ లో మగ్గిపోతున్న 578 మంది సైబర్ నేరస్థుల బాధితులను ఇండియాకు రప్పించింది. కొలువుల కోసం వెళ్లి సైబర్ నేరగాళ్ల చేతిలో పడిపోయిన బాధితులు ఇప్పుడు ఇండియాకు చేరుకున్నారు. గత 24 గంటల నుంచి సీబీఐ అధికారులు బాధితులను ప్రశ్నిస్తున్నారు.. వాళ్ల దగ్గర నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు.
Read Also: CM Revanth : సీరియస్ గా పనిచేయండి.. ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్..!
అయితే, సైబర్ నేరాలు ఏ విధంగా చేయించారు వాళ్ళు, ఏ విధంగా ఉన్నారు.. వాళ్ళు మన దేశానికి సంబంధించిన ఏమైనా సమాచారం సేకరించారా లేదంటే దేశానికి నష్టం కలిగించే విధంగా ఏదైనా పనులు చేయించారా అనే దానిపై సీబీఐ ఆరా తీస్తుంది. రెండు దఫాల్లో మయన్మార్, థాయిలాండ్ నుంచి ఢిల్లీకి చేరిన బాధితులను సీబీఐ ప్రశ్నిస్తుంది. థాయ్‌లాండ్ కేంద్రంగా సాగిన మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న బందీలందరికీ విముక్తి లభించినట్టయ్యింది. లక్షల జీతం పేరిట ఆశ చూపి తీరా వెళ్లాక, మన భారతీయ యువతతో సైబర్ నేరాలు చేయిస్తున్న తీరు ఇది.. థాయిలాండ్, మయన్మార్ దేశాలకు చేరుకున్న నిరుద్యోగులకు ముందుగా 10 రోజులు పాటు అతి మర్యాదలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పాస్ పోర్టులను తీసుకుంటారు. అప్పట్నుంచి వీళ్లకు కష్టాలు మొదలవుతాయి ..మేము చెప్పినట్లు వింటే మీరు తిరిగి ఇండియాకు వెళ్తారని లేకుంటే మీ జీవితం ఇక్కడే ముగుస్తుందని భయపడతారు.. అంతేకాకుండా సైబర్ నేరాలు చేయాలని వాళ్లకి బెదిరిస్తారు.. చేయని వాళ్లకు చుక్కలు చూపెడతారు.. అంతేకాకుండా జైల్లో మాదిరిగా శిక్షలు వేస్తుంటారు.. ఉదయం నుంచి రాత్రి వరకు వీళ్లు సైబర్ నేరాలు చేస్తూనే ఉండాలి.. ముఖ్యంగా ఇండియాతో పాటు పలు దేశాలకు కాల్ చేసి ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉండాలి.. అయితే కనీస వసతులు కల్పించకుండా వీళ్ళని చీకటి గదిలో బంధించి వీళ్ళ చేత సైబర్ నేరాలు చేయిస్తున్న విషయాన్ని మీడియా వెలుగులోకి తెచ్చింది.
Read Also: Union Minister Srinivasa Varma: స్టీల్ పరిశ్రమ అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది..
ఇక, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడింది. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల మేరకు సైబర్ నేరగాళ్ల చెర లో ఉన్న భారతీయ యువతను వెంటనే ఇండియా కి రప్పించేందుకు సన్నాహాలు చేశారు.. ఇందులో భాగంగా మొదటి దఫలో 578 మంది యువకులను ఢిల్లీకి తీసుకొని వచ్చారు.. ఢిల్లీకి చేరుకున్న యువత మొత్తాన్ని కూడా సిబిఐ తమ కస్టడీ లో ఉంచుకొని విచారణ జరుగుతుంది. ఎందుకంటే మన దేశానికి సంబంధించి ఏదైనా కీలక సమాచారాన్ని సేకరించారా లేదంటే ఎవరైనా ఉగ్రవాదులు వీళ్ళని బంధించారా అనే కోణంలో విచారిస్తున్నారు .దీంతో పాటుగా వీళ్ళ సెల్ఫోన్లోకి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా సిబిఐ తీసుకుంటుంది. కేంద్రం వీరిని అక్కడి ఆర్మీ సాయంతో వారిని కాపాడి తీసుకొచ్చింది.. మనుషులను రవాణా చేసే ముఠాలో నిరుద్యోగులు పడిపోతే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినట్లే. అక్కడ మానవ అక్రమ రవాణా చేసే ముఠా లు ట్రాప్ చేసి మన వాళ్ళని బుట్టలో వేసుకుంటారు. మయన్మార్‌లోని మైవాడీ జిల్లాలోని చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీకి 3,000 డాలర్లకు విక్రయించింది. పలుమార్లు మయన్మార్‌లోని భారత దౌత్యకార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపింది.
Read Also: Waqf: “ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం” వక్ఫ్ ఆస్తి.. ఎంఐఎం నేత క్లెయిమ్..
కాగా, భారత్ సహా అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి రావడంతో మయన్మార్ తన ఆర్మీతో ఫిబ్రవరి 22న భారతీయులను రక్షించి ఆశ్రయం కల్పించింది. కేంద్ర దౌత్యం ఫలించడంతో తొలి విమానం భారతీయులను ఇండియాకు తీసుకొచ్చింది. రెండో విమానంలో మిగిలిన వారిని థాయ్‌లాండ్‌లోని మై సోట్ మీదుగా ఇండియాకు తరలించింది. దీంతో రిపాట్రియేషన్ ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్‌కు తెలుగువారు. బాధితుల్లో తెలంగాణకు చెందిన 23 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 మంది మొత్తం 42 మంది తెలుగువారు ఉన్నారు. సీబీఐ అదుపులోకి తీసుకుంది. మీరు ఫారిన్ ఎలా వెళ్లారు? ఎవరి సాయంతో వెళ్లారు? అర్ధరాత్రి దాటినా బాధితుల నుంచి సీబీఐ స్టేట్‌మెంట్ తీసుకుంటూనే ఉంది. ఈ విషయంపై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ కూడా వివరాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: SSMB 29: ‘ఇండియానా జోన్స్’ పోయి ‘హనుమాన్’ వచ్చే.. అసలేం చేస్తున్నారు మాష్టారూ?
అలాగే, 578 మందిని మా ప్రభుత్వం సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చింది. అందరూ క్షేమంగా ఉన్నారు. థాయ్‌లాండ్ కేంద్రంగా జరిగిన ఈ ఉదంతాన్ని మా దృష్టికి తీసుకురావడం, బాధితుల కోసం పోరాడిన తీరు ఇది.. కొంత మంది బాధితులు మాట్లాడుతూ.. ఇది మాకు పునర్జన్మ.. వాస్తవానికి మేం థాయ్‌లాండ్‌కు ఉద్యోగానికని వెళ్లాం.. మాకు తెలియకుండా మాలో కొందరిని మయన్మార్‌కు అక్రమంగా పంపారు.. అక్కడ పాస్‌పోర్టు లాక్కొని, మాతో నేరాలు చేయించడానికి ప్రయత్నించారు.. అయితే, కేంద్ర ప్రభుత్వ చొరతో తిరిగి మా సొంత గ్రామాలకు వెళుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు.