Guntur Crime: వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న భార్యను, భర్తను.. పిల్లలను.. ఇలా అడ్డుగా ఉన్నవారిని అంతా లేపేస్తున్న ఘటనలో ఎన్నో వెలుగుచూశాయి.. ట్రాంజెంబర్తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో గత రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావును కత్తితో దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావు అనే వ్యక్తి కొంతకాలంగా హెచ్ఐవీ పేషెంట్లకు బ్లడ్ టెస్ట్లు మెడిసిన్లు ఇప్పిస్తూ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు.. ఇతను కొంతకాలంగా రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ పరిచయం కావడంతో డాన్స్ ప్రోగ్రామ్లకు వెల్తూ ఉండేవాడు.. ఈ క్రమంలో తెనాలి మార్సిన్ పేటకు చెందిన అన్నపురెడ్డి దీపక్ అనే వ్యక్తికి రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్కు పరిచయం ఏర్పడగా వీరిద్దరి సన్నిహితాన్ని గమనించిన దీపక్ భార్య మృతుడు కాశీ నా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావుకు దీపక్ మరియు రఫీ అలియాస్ నర్మదా వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ పిలిచి మందలించడంతో వీరిద్దరిని ఎక్కడ దూరం చేస్తారో అనే భయంతోనే నరికి చంపినట్లుగా మృతుడి కుటుంబీకులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు పోలీసులు అదుపులో రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ తో పాటు మరో ట్రాన్స్ జెండర్ ను విచారిస్తున్నారు దీపక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు……