2025 Tata Altroz: టాటా ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్ 2025 లాంచ్.. వివిధ వేరియెంట్ ధరలు ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 Tata Altroz: టాటా మోటార్స్ 2025 ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. 2020 జనవరిలో ప్రారంభమైన ఆల్ట్రోస్‌కి ఇది పెద్ద అప్‌డేట్. కొత్త డిజైన్, ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ కార్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది మారుతి సుజుకి బలెనో, హ్యుందాయ్ i20 వంటి హాచ్బ్యాక్ కార్లకు గట్టి ఇవ్వనుంది. ఇకపోతే ఈ టాటా ఆల్ట్రోస్ 2025 మోడల్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ S లాంటి నాలుగు ట్రిమ్ లలో లభిస్తుంది. అలాగే ఇందులో 1.2L రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 1.2L iCNG ఇంజిన్, 1.5L రెవోటార్క్ డీజిల్ ఇంజిన్ వంటి మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. మరి వివిధ వేరియంట్స్ కార్ల ధరలు ఇలా ఉన్నాయి.
Read Also: Vaibhav Suryavanshi: చిన్నోడిని చూసి మురిసిపోయిన పేరెంట్స్..!
Also Read
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
పెట్రోల్ వేరియంట్ ధరలు (ఎక్స్-షోరూమ్):
స్మార్ట్: రూ. 6.89 లక్షలు
ప్యూర్: రూ. 7.69 లక్షలు
క్రియేటివ్: రూ. 8.69 లక్షలు
అకంప్లిష్డ్ S: రూ. 9.99 లక్షలు
iCNG వేరియంట్ ధరలు:
స్మార్ట్: రూ. 7.89 లక్షలు
ప్యూర్: రూ. 8.79 లక్షలు
క్రియేటివ్: రూ. 9.79 లక్షలు
అకంప్లిష్డ్ S: రూ. 11.09 లక్షలు
డీజిల్ వేరియంట్ ధరలు:
ప్యూర్: రూ. 8.99 లక్షలు
క్రియేటివ్: రూ. 9.99 లక్షలు
అకంప్లిష్డ్ S: రూ. 11.29 లక్షలు
అలాగే, పెట్రోల్ DCA వేరియంట్ ఇప్పుడు అకంప్లిష్డ్+S ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. సన్‌రూఫ్ ఎంపిక ప్యూర్ అండ్ క్రియేటివ్ ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇంకా డీజిల్ AMT వేరియంట్లు కూడా ప్యూర్ అండ్ క్రియేటివ్ ట్రిమ్‌లలో లభిస్తాయి. పాత డిజైన్ ను కొనసాగించినప్పటికీ, కొత్త ఆల్ట్రోస్ లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, LED హెడ్‌లైట్స్, రిఫ్రెష్డ్ గ్రిల్, కొత్త బంపర్లు, 16-అంగుళాల అలాయ్ వీల్స్, కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ వంటి అప్డేట్లు ఉన్నాయి. ఈ కార్లు డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ వంటి ఐదు రంగులలో అందుబాటులో ఉంది. ఇక కారు లోపల రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి.
తాజావార్తలు
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!