Mega157 Shooting : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఈ రోజు (మే 23, 2025) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా, చిరంజీవి 157వ చిత్రంగా (మెగా 157) ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి అంటే 2026లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ – గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి, తనదైన హాస్యం, యాక్షన్, ఎమోషన్స్ తో ఈ సినిమాను ఒక బ్లాక్‌బస్టర్‌గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్‌లో చిరంజీవి కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్‌గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో ఒక పాత్ర కోసం నయనతారను అనౌన్స్ చేయగా కేథరిన్ తెరిసా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read Also :K.A. Paul : సిగరెట్ కంటే బెట్టింగ్స్ యాప్స్ డేంజర్.. కే.ఏ పాల్ ఆవేదన