రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జీ-20 సదస్సు విందుకు భారత రాష్ట్రపతి పేరిట పంపిన ఆహ్వానంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మారుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. ప్రపంచానికి ‘ఇండియా’ అనే పేరు తెలుసని.. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మార్చాల్సే అవసరం ఏమొచ్చిందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశం పేరును మారుస్తోందని ఆరోపించారు.
Read Also: Minister Botsa: ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కాదు..
ఇండియా పేరు మార్పుపై మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును మార్చారు. G-20 సమ్మిట్ డిన్నర్‌కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్‌పై ‘భారత్’ అని రాసి ఉంది… ఇంగ్లీషులో ఇండియా అండ్ ఇండియా కాన్స్టిట్యూషన్ అని, హిందీలో ఇండియాస్ కన్స్టిట్యూషన్ అని అంటాము. మనమంతా ‘ఇండియా’ అంటున్నాం, ఇందులో కొత్తేముందని ప్రశ్నించారు. కానీ ఇండియా పేరు ప్రపంచానికి తెలుసు. అకస్మాత్తుగా దేశం పేరు మార్చాల్సిన పరిస్థితి ఏంటని ఆమే ప్రశ్నించారు.
Read Also: Sasikala: కోర్టుకు గైర్హాజరుపై శశికళపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లోనే ఇండియా పేరును భారత్‌గా మార్చే తీర్మానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం రాజ్యాంగం “ఇండియా, దట్ ఈజ్ భారత్” అని దేశాన్ని సంబోధిస్తున్నది. అయితే దీనిని “భారత్(Bharat)” అని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త తీర్మానాన్ని తీసుకురానున్నట్టు సమాచారం.